- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసీస్‌తో తొలి వన్డే...మ్యాచ్ కు వర్షం ముంపు!
టీమిండియా ఇవాళ్టి నుంచి మరో రసవత్తర ఫైట్ కు సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుతో వన్డే సిరీస్ ఆడనుంది టీమిండియా.

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా ఇవాళ్టి నుంచి మరో రసవత్తర ఫైట్ కు సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుతో వన్డే సిరీస్ ఆడనుంది టీమిండియా. ఇందులో భాగంగానే, టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మరికాసేపట్లోనే ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే తొలి మ్యాచ్ నేపథ్యంలో అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ కు పదేపదే వర్షం అడ్డంకిగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో టాస్ కూడా కాస్త ఆలస్యం అయ్యే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు. మ్యాచ్ ప్రారంభం అయినప్పటికీ, మధ్యలో అంతరాయం ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దాదాపు ఇవాళ్టి మ్యాచ్ కు 35% వర్షం అడ్డంకిగా మారుతుందని అంటున్నారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గ్రాండ్ ఎంట్రీ
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అందరి కళ్ళు విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ పైన పడ్డాయి. దాదాపు 7 నెలల తర్వాత ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు టీమిండియా బ్లూ జెర్సీ ధరిస్తున్నారు. రిటైర్మెంట్ దశకు వచ్చిన ఈ ఇద్దరు ప్లేయర్లు, ఈ సిరీస్ లో అద్భుతంగా రాణిస్తే, 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కొనసాగే ఛాన్సులు ఉన్నాయి. దీంతో అందరి దృష్టి కూడా ఈ ఇద్దరు ప్లేయర్ల ఆట తీరుపైన పడింది. మరి ఇద్దరు ప్లేయర్లు ఎలా ఆడతారో చూడాలి. కాగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ లు జియో హాట్ స్టార్ లో చూడవచ్చు.






