- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త డిజైన్.. కొత్త లుక్.. టీ20 ప్రపంచకప్-2026లో భారత జట్టు ధరించే జెర్సీ ఇదే
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ పొట్టి ప్రపంచకప్‌లో భారత జట్టు ధరించే జెర్సీని బీసీసీఐ బుధవారం ఆవిష్కరించింది. రాయ్‌పూర్‌లో భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో తొలి ఇన్నింగ్స్ విరామ సమయంలో 100 మందికిపైగా విద్యార్థులతో భారత జెర్సీని ఆవిష్కరించారు. అనంతరం స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, తిలక్ వర్మ జెర్సీతో ఫోజులిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, జాయింట్ సెక్రెటరీ ప్రభ్‌తేజ్ సింగ్ పాల్గొన్నారు. బ్లూ కలర్‌తో ఉన్న జెర్సీపై మధ్యలో కొత్తగా నిలువగా బ్లూ కలర్‌లో చారలు ఉన్నాయి. పక్కలకు ఇరువైపుల చేతుల వరకూ ఆరెంజ్ కలర్ ఉంది. అలాగే, భారత త్రివర్ణ రంగులతో కూడిన కాలర్‌ను డిజైన్ చేశారు. భుజాలపై వైట్ కలర్‌తో ఉన్న గీతలు అలాగే ఉన్నాయి. ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుండగా భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్‌లో బరిలోకి దిగుతోంది. ఓపెనింగ్ మ్యాచ్‌లో యూఎస్‌ఏతో తలపడనుంది.






