వరల్డ్ కప్‌లో భారత అండర్-19 జట్టు హవా.. జింబాబ్వేపై ఏకంగా 204 రన్స్ తేడాతో

by Harish |

వరల్డ్ కప్‌లో భారత అండర్-19 జట్టు హవా.. జింబాబ్వేపై ఏకంగా 204 రన్స్ తేడాతో
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో యువ భారత్‌కు ఎదురులేకుండా పోయింది. అడ్డొచ్చిన జట్టునల్లా చిత్తు చేస్తూ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. సూపర్-6 రౌండ్‌లో మంగళవారం బులవాయోలో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే‌పై 204 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. టోర్నీలో యువ భారత్‌కు ఇది వరుసగా నాలుగో గెలుపు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. విహాన్ మల్హోత్రా(109 నాటౌట్) అజేయ శతకంతో సత్తాచాటాడు. అతనికితోడు వైభవ్ సూర్యవంశీ(52), అభిగ్యాన్ కుండు(61) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం బంతితోనూ భారత జట్టు అదరగొట్టింది. ఛేదనకు దిగిన జింబాబ్వే 37.4 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు చివాలా(62) మాత్రమే పోరాటం చేశాడు. బౌలర్లు ఉద్దవ్ మోహన్, ఆయుశ్ మాత్రమే చెరో 3 వికెట్లు పడగొట్టి జింబాబ్వే పతనాన్ని శాసించారు. అంబ్రీష్‌కు కూడా 2 వికెట్లు తీశాడు. ఫిబ్రవరి 1న పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది.


Next Story