- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2026లోనూ ఇంగ్లాండ్‌కు భారత జట్లు.. షెడ్యూల్ ప్రకటించిన ఈసీబీ
by Harish |
ప్రస్తుతం భారత పురుషుల క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌లోనే ఉంది.

X
దిశ, స్పోర్ట్స్ : ప్రస్తుతం భారత పురుషుల క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌లోనే ఉంది. ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతోంది. మహిళల క్రికెట్ జట్టు కూడా ఇటీవలే తమ ఇంగ్లాండ్ పర్యటనను పూర్తి చేసుకుంది. టీ20, వన్డే సిరీస్‌లను గెలిచింది. అయితే, వచ్చే ఏడాది కూడా భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఇంగ్లాండ్‌లో పర్యటించనున్నాయి. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) గురువారం వెల్లడించింది. తమ హోం మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించింది. భారత పురుషుల జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. 2026లో జూలై 1 నుంచి 19 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. మరోవైపు, మహిళల జట్టు మూడు టీ20ల సిరీస్, ఓ టెస్టు మ్యాచ్ ఇంగ్లాండ్‌తో ఆడనుంది. మే 28, 30, జూన్ 2 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు, జూలై 10 నుంచి 13 వరకు టెస్టు మ్యాచ్ జరగనుంది.
- Tags
- ind vs eng
Next Story






