ప్రపంచ కప్‌కు ముందు ఆసీస్‌తో టీమిండియా వన్డే సిరీస్‌.. స్వదేశంలో పూర్తి షెడ్యూల్‌ బీసీసీఐ విడుదల

by Disha Web Desk 13 |
ప్రపంచ కప్‌కు ముందు ఆసీస్‌తో టీమిండియా వన్డే సిరీస్‌.. స్వదేశంలో పూర్తి షెడ్యూల్‌ బీసీసీఐ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: స్వదేశంలో టీమిండియా 2023-24లో ఆడనున్న మ్యాచ్‌ల వివరాలను బీసీసీఐ వెల్లడించింది. ఏడాది కాలంలో భారత సీనియర్‌ పురుషుల జట్టు సొంతగడ్డపై 16 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుందని తెలిపింది. ఇందులో 5 టెస్టులు, 3 వన్డేలు, 8 టీ20 మ్యాచ్‌లు ఉన్నట్లు పేర్కొంది. టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌ జరుగనుందన్న బీసీసీఐ.. మొహాలీ, ఇండోర్‌, రాజ్‌కోట్‌ వేదికలుగా ఉంటాయని తెలిపింది. వన్డే వరల్డ్‌కప్‌ కంటే ముందే.. సెప్టెంబరు 22- 27 వరకు ఈ సిరీస్‌ జరుగనుందని వెల్లడించింది.

ఐసీసీ ఈవెంట్‌ తర్వాత టీమిండియా ఆసీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. కొత్త ఏడాదిని అఫ్గనిస్తాన్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌తో ఆరంభించనుందని భారత క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. మొహాలీ, ఇండోర్‌, బెంగళూరులలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతుందని పేర్కొంది. ఆ తర్వాత జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆరంభం కానుందని వెల్లడించింది. హైదరాబాద్‌, వైజాగ్‌, రాజ్‌కోట్‌, రాంచి, ధర్మశాల ఇందుకు వేదికలుగా ఉంటాయని బీసీసీఐ వెల్లడించింది.

ఇండియా హోమ్ సీజన్ 2023-24 షెడ్యూల్..

ఇండియా v ఆస్ట్రేలియా (ODI)

1వ ODI: సెప్టెంబర్ 22, మొహాలీ

2వ ODI: సెప్టెంబర్ 24, ఇండోర్

3వ ODI: సెప్టెంబర్ 27, రాజ్‌కోట్

ఇండియా v ఆస్ట్రేలియా (T20I)

ఫస్ట్ T20I: నవంబర్ 23, వైజాగ్

సెకెండ్ T20I: నవంబర్ 26, త్రివేండ్రం

మూడో T20I: నవంబర్ 28, గౌహతి

ఫోర్త్ T20I: డిసెంబర్ 1, నాగ్‌పూర్

ఐదో T20I: డిసెంబర్ 3, హైదరాబాద్

ఇండియా v ఆఫ్ఘనిస్తాన్

1వ టీ20: జనవరి 11, మొహాలీ

2వ T20I: జనవరి 14, ఇండోర్

3వ టీ20: జనవరి 17, బెంగళూరు

ఇండియా v ఇంగ్లాండ్

తొలి టెస్టు: జనవరి 25-29, హైదరాబాద్

రెండో టెస్టు: ఫిబ్రవరి 2-6, వైజాగ్

మూడో టెస్టు: ఫిబ్రవరి 15-19, రాజ్‌కోట్

నాల్గో టెస్టు: ఫిబ్రవరి 23-27, రాంచీ

ఐదు టెస్టు: మార్చి 7-11, ధర్మశాల



Next Story

Most Viewed