కామన్వెల్త్ గేమ్స్-2030 ఆతిథ్యానికి భారత్ బిడ్?

by Harish |

ఒలింపిక్స్-2036 ఆతిథ్య హక్కుల కోసం భారత్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

కామన్వెల్త్ గేమ్స్-2030 ఆతిథ్యానికి భారత్ బిడ్?
X

దిశ, స్పోర్ట్స్ : ఒలింపిక్స్-2036 ఆతిథ్య హక్కుల కోసం భారత్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి అధికారికంగా లేఖ రాసింది. ఒలింపిక్స్‌ కంటే ముందు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఈవెంట్‌ను భారత్‌లో నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కామన్వెల్త్ గేమ్స్-2030‌ ఆతిథ్యమివ్వడానికి భారత్ ఆసక్తి కనబరుస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘కామన్వెల్త్ గేమ్స్-2030‌ మేము ఆసక్తిగా ఉన్నాం. కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్‌తో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చర్చలు జరిపింది. అలాగే, కామన్వెల్త్ గేమ్స్-2026 నుంచి తొలగించిన క్రీడలను భారత్‌లో నిర్వహిస్తామని ప్రతిపాదించాం.’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. హోస్టింగ్ రైట్స్ కోసం బిడ్ వేయడానికి మార్చి 31 చివరి తేదీ. అందుకు సంబంధించిన ప్రక్రియను క్రీడా మంత్రిత్వ శాఖ త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. 2010లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే.


Next Story