చైనాను చిత్తుగా ఓడించిన భారత్.. ఆసియా కప్ హాకీ ఫైనల్‌లోకి ఎంట్రీ

by Malleboina Mahesh |

ఆసియా కప్ హాకీ సూపర్ ఫోర్ మ్యాచులో భారత్ భారీ విజయం సాధించి నేరుగా ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

చైనాను చిత్తుగా ఓడించిన భారత్.. ఆసియా కప్ హాకీ ఫైనల్‌లోకి ఎంట్రీ
X

దిశ, వెబ్ డెస్క్: ఆసియా కప్ హాకీ (Asia Cup Hockey) సూపర్ ఫోర్ మ్యాచులో భారత్ భారీ విజయం సాధించింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ మ్యాచులో మొదటి నుంచి దూకుడుగా ఆడిన భారత ప్లేయర్లు చైనాపై ఏకపక్షంగా 7-0 తేడాతో విజయం సాధించారు. దీంతో భారత జట్టు నేరుగా ఫైనల్ చేరుకుంది. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్ చైనాపై అగ్రెసివ్‌గా ఆడింది. నాల్గో నిమిషంలో శిలానంద్ లక్రా తొలి గోల్ చేయగా.. వెంటనే ఏడో నిమిషంలో దిల్‌ప్రీత్ సింగ్ గోల్ చేశాడు. అనంతరం18వ నిమిషంలో మన్దీప్ సింగ్ 3వ గోల్, 37వ నిమిషంలో రాజ్‌కుమార్ పాల్ 4వ గోల్, 39వ నిమిషంలో సుఖ్‌జీత్ సింగ్ 5వ గోల్ చేసి భారత జట్టు లీడ్‌ను మరింత బలపరిచారు. అనంతరం రెండో సెషన్‌లో స్ట్రైకర్ అభిషేక్ మెరుపులు మెరిపించాడు. వరుసగా 46వ, 50వ నిమిషాల్లో రెండు గోల్స్ సాధించి చైనాను పూర్తిగా చిత్తు చేశాడు. ఈ విజయంతో భారత్ సూపర్–4 లీగ్ పట్టికలో 7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. నాలుగు పాయింట్లతో దక్షిణ కొరియా రెండో స్థానంలో ఉండగా, చైనా, మలేషియా చెరో మూడు పాయింట్లతో వెనుకబడ్డాయి. ఆదివారం జరిగే ఫైనల్‌లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియాతో తలపడనుంది.

Next Story