- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ టార్గెట్ చేధించిన ఆస్ట్రేలియా.. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు రెండో ఓటమి

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో (Womens World Cup 2025) టీమ్‌ఇండియాకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆదివారం విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. మొదట టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా భారత్‌ను 330కి అలౌట్ చేసింది. ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 49 ఓవర్లలో ఈ భారీ లక్ష్యాన్ని చేధించింది. ఇప్పటి వరకు 4 మ్యాచుల్లో భారత్ 2 గెలిచి, 2 ఓడింది.
మ్యాచ్‌లో భాగంగా ఓపెనర్ల మెరుపులతో టీమిండియా భారీ స్కోర్ చేసినా.. ఎలీసా హెలీ(142) సెంచరీతో చుక్కలు చూపించింది. లీసా పెర్రీ (47 నాటౌట్), గార్డ్‌నర్ (45)లు తోడవవ్గా ఆస్ట్రేలియా వన్డే చరిత్రలో అత్యధిక పరుగుల ఛేదించి ఆసీస్ జట్టు రికార్డు నెలకొల్పింది. అలాగే ఫోబ్ లీచ్‌ఫీల్డ్ (40), సోఫీ మోలినెక్స్ (18), కిమ్ గార్త్ (14*), తాహిలా మెక్‌గ్రాత్ (12) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రీ చరణి 3, దీప్తి శర్మ, అమన్‌జ్యోత్ కౌర్ చెరో రెండు వికెట్లు తీశారు. మరోవైపు భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. ఓపెనర్లు స్మృతి మంధాన (80), ప్రతీక రావల్ (75) అదరగొట్టారు. హర్లీన్ డియోల్ (38) జెమీమా రోడ్రిగ్స్ (33), రిచా ఘోష్ (32) పరుగులు చేశారు. ఇక, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22) మరోసారి తక్కువ స్కోరుతో పెవిలియన్ బాట పట్టింది.






