- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన భారత్
బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది.

దిశ, స్పోర్ట్స్ : బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. ఇండోనేషియాలో జరుగుతున్న ఈ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. తొలి గ్రూపు మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన రెండో గ్రూపు మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించిన భారత్ 110-83 తేడాతో యూఏఈని చిత్తు చేసింది. మొదటి గేమ్ నుంచి భారత షట్లర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. సగం సమయం ముగిసే సరికి భారత్ 55-41తో ఆధిపత్య స్థితిలో నిలిచిన భారత్ ఆ తర్వాత కూడా అదే జోు కొనసాగించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. గ్రూపు డిలో వరుసగా రెండో విజయంతో భారత్‌కు క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. అదే గ్రూపులో ఉన్న హాంకాంగ్ కూడా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. ఆదివారం చివరి గ్రూపు మ్యాచ్‌లో హాంకాంగ్‌తో భారత్ తలపడనుంది.






