Asia Cup 2025: బీసీసీఐ కీలక నిర్ణయం..ఆ రోజే టీమిండియా జట్టును ప్రకటించేది

by velandi.Saikiran |

ఆసియా కప్ నేపథ్యంలో జట్టును.. ఆగస్టు 19వ తేదీన బీసీసీఐ ప్రకటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు

Asia Cup 2025: బీసీసీఐ కీలక నిర్ణయం..ఆ రోజే టీమిండియా జట్టును ప్రకటించేది
X

దిశ, వెబ్ డెస్క్: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఈ మెగా టోర్నమెంట్.. యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 28వ తేదీ వరకు.. ఈ టోర్నమెంట్ కొనసాగనున్న నేపథ్యంలో... ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య కూడా సెప్టెంబర్ 14వ తేదీన మ్యాచ్ ఉండనుంది. సెప్టెంబర్ 14వ తేదీన ఈ రెండు జట్ల మధ్య... దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగుతుంది.

ఇక ఈ ఆసియా కప్ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈ టోర్నమెంట్ కోసం ఆడే జట్టును.. ఆగస్టు 19వ తేదీన బీసీసీఐ ప్రకటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా అలాగే వైస్ కెప్టెన్ గా గిల్ ఉండే ఛాన్సులు ఉన్నాయి. అలాగే హార్దిక్ పాండ్యా కూడా తుది జట్టులో ఉంటాడని.. యశస్వి జైస్వాల్ అలాగే పంత్ దూరం కాబోతున్నట్లు చర్చ జరుగుతోంది.

Next Story