దక్షిణాఫ్రికాతో టీ20లు..భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ

by velandi.Saikiran |

5 టీ20ల సిరీస్ షురూ కానుంది. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో తాజాగా భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ

దక్షిణాఫ్రికాతో టీ20లు..భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 9వ తేదీ నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. 3 వన్డేల సిరీస్ పూర్తికాగానే, 5 టీ20ల సిరీస్ షురూ కానుంది. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో తాజాగా భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఈ టోర్నమెంట్ ఆడనుంది భారత జట్టు. మెడలో నొప్పి గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన గిల్, తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

అతని ఫిట్నెస్ క్లియర్ అయితేనే ఈ సిరీస్ ఆడతాడు. లేకపోతే, జట్టుకు దూరం కావాల్సిందే. అందుకే అతని పేరు నామ‌మాత్రంగా లిస్టులో చేర్చారు. రెండు రోజుల్లో గిల్ హెల్త్ అప్డేట్ రానుంది. ఇక అటు వికెట్ కీపర్లు జితేష్ శర్మ, సంజు శాంసన్ టీ20 సిరీస్ కు సిద్ధమయ్యారు. బుమ్రా మళ్లీ టి20 సిరీస్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఆసియా కప్ లో గాయం కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా కూడా దక్షిణాఫ్రికాతో జరిగే టీ20లు ఆడుతున్నాడు. ఈ మేరకు అతని పేరు కూడా స్క్వాడ్ లో చేర్చింది బీసీసీఐ.

ఎంపిక చేసిన భార‌త జ‌ట్టు ఇదే: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్ (డౌట్‌) , అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (కీప‌ర్‌), సంజు శాంసన్ (కీప‌ర్‌), బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాద‌వ్‌, హర్షిత్ రాణా, సుంద‌ర్‌ ఉన్నారు.

Next Story