సంచలన నిర్ణయం తీసుకున్న హైదరాబాద్ స్పిన్నర్

by Harish |

భారత మహిళా స్పిన్నర్, హైదరాబాద్‌కు చెందిన గౌహెర్ సుల్తానా సంచలన నిర్ణయం తీసుకుంది.

సంచలన నిర్ణయం తీసుకున్న హైదరాబాద్ స్పిన్నర్
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా స్పిన్నర్, హైదరాబాద్‌కు చెందిన గౌహెర్ సుల్తానా సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించింది. ‘చాలా ఏళ్లు భారత జెర్సీని ధరించాను. నా క్రికెటింగ్ జర్నీలో అత్యంత ఎమోషనల్ నోట్ రాయడానికి సమయం ఆసన్నమైంది. జ్ఞాపకాలతో నిండిన హృదయంతో, కృతజ్ఞతతో కూడిన కళ్లతో ఆటకు సంబంధించిన అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా.’అని సుల్తానా తన వీడ్కోలు ప్రకటన చేసింది. అత్యున్నత స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలో చాలా గొప్ప గౌరవమని తెలిపింది. కాగా, 2008లో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సుల్తానా 50 వన్డేలు, 37 టీ20లు ఆడింది. మొత్తం 95 వికెట్లు తీసింది. ఆమె చివరిసారిగా 2014లో భారత్‌కు ఆడింది. సుల్తానా తన కెరీర్‌లో రెండు వన్డే వరల్డ్ కప్‌లు(2009, 2013), మూడు టీ20 వరల్డ్ కప్‌లు ఆడింది. దేశవాళీలో ఆమె హైదరాబాద్, పుదుచ్చేరి, రైల్వేస్, బెంగాల్‌కు ఆడింది. 2024,2025 సీజన్లలో ఆమె ఉమెన్స ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించింది.


Next Story