- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో తిరుగులేని రికార్డులు..భారీ మార్పులతో టీమిండియా
విశాఖలో తిరుగులేని రికార్డులు..భారీ మార్పులతో టీమిండియా

దిశ, వెబ్ డెస్క్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు ఆఖరి వన్డే మ్యాచ్ జరగనుంది. విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ భారత్, దక్షిణాఫ్రికా జట్లకు చాలా కీలకం. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో తలో వన్డే గెలిచి ఉన్నాయి. మూడవ వన్డే గెలిచిన జట్టుకు ట్రోఫీ దక్కనుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలవాలని భారత్ చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ కోల్పోయిన బాధలో ఉన్న భారత్, ప్రతీ కారం తీర్చుకునేందుకు సిద్ధమైంది. దానికి తగ్గట్టుగానే విశాఖపట్నం గ్రౌండ్ భారత జట్టుకు బాగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి.
ఈ గ్రౌండ్ లో ఇప్పటి వరకు భారత జట్టు పది మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఏడింటిలో గెలవగా, రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. ఈ రికార్డులు భారత జట్టుకు అనుకూలించే ఛాన్సులు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టుకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇప్పటికైనా భారత జట్టు టాస్ గెలుస్తుందో లేదో చూడాలి. అలాగే ఈ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వస్తాడని అంటున్నారు. అతడు జట్టులోకి వస్తే ఎవరిపైన వేటు వేయాలి అనే దాని పైన ఆలోచన చేస్తున్నారు. ఓపెనర్ యశస్వి జైష్వాల్ పై వేటు వేసి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకువస్తారని చెబుతున్నారు. లేదా రిషబ్ పంత్ తుది జట్టులోకి వస్తాడని కూడా కొంతమంది చెబుతున్నారు. కనీసం ఒకటి లేదా రెండు మార్పులతో బరిలోకి దిగనుంది భారత జట్టు.






