అడిలైడ్ టెస్ట్ ఓటమి ఎఫెక్ట్.. WTC పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి భారత్

by Sathputhe Rajesh |

ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ చేరాలనుకున్న భారత్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

అడిలైడ్ టెస్ట్ ఓటమి ఎఫెక్ట్.. WTC పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి భారత్
X

దిశ, స్పోర్ట్స్ : ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ చేరాలనుకున్న భారత్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్‌లో మూడో స్థానానికి పడిపోయింది. తాజా ఓటమితో భారత్ 61.11 పాయింట్ల నుంచి 57.29 పాయింట్లకు పడిపోయింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా 60.71 పాయింట్లతో డబ్ల్యూటీసీ పాయింట్ల జాబితాలో టాప్‌లోకి దూసుకొచ్చింది. సౌతాఫ్రికా 59.26 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. 50 పాయింట్లతో శ్రీలంక నాలుగో స్థానంలో నిలిచింది. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా మరో విజయం సాధిస్తే ఆస్ట్రేలియాను అధిగమించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. డబ్ల్యూటీసీ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరాలంటే భారత్ ఈ సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌లను తప్పక గెలవాల్సి ఉంటుంది. భారత్-ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్ట్ బ్రిస్బేన్ వేదికగా ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది.

Next Story