Jasprit Bumrah : బుమ్రా ఆడటంపై గిల్ కీలక ప్రకటన

by velandi.Saikiran |   (  Updated:2025-07-30 13:18:07  IST  )

టీమిండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England)మధ్య ప్రస్తుతం 5 టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ

Jasprit Bumrah : బుమ్రా ఆడటంపై గిల్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England)మధ్య ప్రస్తుతం 5 టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికే నాలుగు టెస్టులు పూర్తయ్యాయి. రేపటి నుంచి ఐదో టెస్టు లండన్ ( London) వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా యంగ్ కెప్టెన్ గిల్ ( Shubman Gill ) కీలక ప్రకటన చేశారు.

ఇంగ్లాండ్ తో ఐదో టెస్టులో బుమ్రా ( Jasprit Bumrah) ఆడడంపై మ్యాచ్ కంటే ముందు నిర్ణయం తీసుకుంటామని తాజాగా కెప్టెన్ గిల్ వెల్లడించారు. ఈ మేరకు మీడియాకు సమాచారం ఇచ్చారు గిల్. పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించేలా ఉందని మీడియా సమావేశంలో అభిప్రాయపడ్డారు. బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్‌ సింగ్‌ ను ( Arshdeep Singh) తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని... కానీ ఆ విషయాన్ని మ్యాచ్ కంటే ముందు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అదే సమయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రవర్తనపై కూడా గిల్ స్పందించారు.

కోచ్ గంభీర్ పట్ల క్యూరేటర్ అలా ఎందుకు ప్రవర్తించారో తనకు అర్థం కావడం లేదని వివరణ ఇచ్చారు. దీంతో గిల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా.. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇప్పటివరకు నాలుగు టెస్టులు పూర్తయ్యాయి. ఇందులో రెండు టెస్టులు ఇంగ్లాండ్ గెలవగా... ఒకటి టీమిండియా గెలిచింది. అలాగే ఒక మ్యాచ్ డ్రా అయింది.

Next Story