- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : భారత్ మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యమివ్వబోతోంది. 2028లో జరిగే వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ హక్కులను భారత్ దక్కించుకుంది. ఒడిశాలోని భువనేశ్వర్ వేదికగా ఈ ఈవెంట్ జరగనుంది.గురువారం పొలాండ్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో భారత్‌కు ఆతిథ్య హక్కులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల కోసం జరిగే వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ హక్కుల కోసం ఈ ఏడాది ఆరంభంలో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బిడ్ వేసింది. వరల్డ్ అథ్లెటిక్స్ నుంచి ఇద్దరు సభ్యులతో కూడిన బృందం జనవరిలో భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం కాంప్లెక్స్‌లోని ఇండోర్ సదుపాయాన్ని సందర్శించింది. తాజాగా ఆతిథ్య హక్కులను భారత్‌కు కట్టబెట్టినట్టు వరల్డ్ అథ్లెటిక్స్ వెల్లడించింది. ఈ ఈవెంట్ భారత్‌లో జరగడం ఇదే తొలిసారి కానుంది. జపాన్, ఖతర్, చైనా తర్వాత ఆతిథ్యమిస్తున్న నాలుగో ఆసియా దేశం భారత్. ఈ ఏడాది మార్చిలో పొలాండ్ వేదికగా వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్ జరగనుంది. ఇందులో భారత్ నుంచి అథ్లెట్లు ఎవరూ పాల్గొనడం లేదు.






