- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
U-19 Women's T20 World Cup : అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ సెమీస్ లో భారత్ లక్ష్యం 114పరుగులు
అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్(U-19 Women's T20 World Cup Semi-Final) లో ఇంగ్లాండ్ జట్టు(England team) టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసి 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 113పరుగులు చేసింది. భారత్(India)ముందు 114పరుగుల లక్ష్యం(Target) విధించింది.

దిశ, వెబ్ డెస్క్: అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్(U-19 Women's T20 World Cup Semi-Final) లో ఇంగ్లాండ్ జట్టు(England team) టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసి 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 113పరుగులు చేసింది. భారత్(India)ముందు 114పరుగుల లక్ష్యం(Target) విధించింది. రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా బౌలర్లలో రాణించి ఇంగ్లాండ్ బ్యాటర్లు కట్టడి చేశారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో డేవినా సారా (45), అబి నోర్రోవ్ (30) రాణించారు. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ 3, పరునికా 3, ఆయుషి 2 వికెట్లు పడగొట్టారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మహిళల యువ జట్టు 8ఓవర్లు ముగిసే నాటికి వికెట్ నష్టపోకుండా 52పరుగులు చేసింది. ఓపెనర్లు జి.కమలిని(22) , గొంగిడి త్రిష(30) పరుగులతో ఆడుతున్నారు. ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా టీమిండియా ఫైనల్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ కప్ లో వరుస విజయాలను సాధించిన భారత యువ జట్టు ఇంగ్లాంగ్ పై గెలిచి ఫైనల్ లో సౌత్ ఆఫ్రికాను ఢీ కొట్టనుంది. తొలి సెమీ ఫైనల్ లో ఆసీస్ పై సౌత్ అఫ్రికా విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది.






