- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా చెత్త రికార్డు
ఇంగ్లండ్ లో లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిని చవిచూసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్ లో లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిని చవిచూసింది. భారత్ నిర్దేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి, మ్యాచ్‌ను తమ ఖాతాలో వేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 471 రపరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 465 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా 364 పరుగులు చేసి.. ఇంగ్లాండ్ కు 371 పరుగుల లక్ష్యాన్నినిర్దేశించింది. 82 ఓవర్లలోనే ఇంగ్లాండ్ 5 వికెట్ల నష్టానికి 371 టార్గెట్ ను ఛేదించింది.
ఈ ఓటమితో టీమిండియ ఒక అరుదైన చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఒకే టెస్టు మ్యాచ్‌లో ఐదు సెంచరీలు సాధించినప్పటికీ ఓడిపోయిన తొలి జట్టుగా భారత జట్టు చరిత్రలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అదిరిపోయే శతకాలు నమోదు చేశారు
రిషభ్ పంత్ రెండు సెంచరీలు (134, 118)
యశస్వి జైశ్వాల్ – 101
శుభ్‌మన్ గిల్ – 147
కేఎల్ రాహుల్ – 137
కానీ.. ఈ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన జట్టును గెలిపించలేకపోయింది.
ఇంతకు ముందు ఈ తరహా రికార్డు ఆస్ట్రేలియాకు చెందింది. 1928/29 యాషెస్ సిరీస్‌లో.. ఆ జట్టు నాలుగు సెంచరీలు చేసినప్పటికీ ఓడిపోయింది. అదే మ్యాచ్‌లో డాన్ బ్రాడ్‌మాన్ తన తొలి శతకం నమోదు చేశాడు. ఇక ఈ రికార్డును అధిగమించి టీమిండియా నూతన రికార్డు నెలకొల్పడంతో ఇది చర్చనీయాంశంగా మారింది.






