IND vs SA.. భారీ స్కోర్ చేసిన భారత్

by Muthe.Rajitha |

భారత్ vs సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసింది.

IND vs SA.. భారీ స్కోర్ చేసిన భారత్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ vs సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసింది. రాంచీ JSCA ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న దక్షిణాఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా 2025-26 సిరీస్‌లోని తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ 349/8 స్కోర్ చేసింది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (135) అద్భుతమైన ప్రదర్శన చేసాడు. ఓపెనర్ రోహిత్ శర్మ (57) మరియు కెప్టెన్ KL రాహుల్ (60) అర్ధశతకాలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. బలోపేతం చేశారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో నాంద్రే బర్గర్ (2), ఓట్నీల్ బార్ట్‌మన్ (2), మార్కో జాన్సెన్ (1), కార్బిన్ బోష్ (2) వికెట్లు తీశారు. కాగా 350 పరుగుల భారీ లక్ష్యంతో సౌతాఫ్రికా బరిలోకి దిగనుంది.

Next Story