- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెచ్చిపోయిన పాండ్యా, దుబే.. నాలుగో టీ20లో భారత్ భారీ స్కోర్
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ (T20 series) జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు నాలుగో టీ20 మ్యాచ్ పూణే వేదికగా జరుగుతుంది.

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ (T20 series) జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు నాలుగో టీ20 మ్యాచ్ పూణే వేదికగా జరుగుతుంది. కాగా ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ (England) జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు (Indian team) మొదట బ్యాటింగ్ చేసిన భారత్ మొదట్లో వరుస వికెట్లు కోల్పోవడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనింగ్ బ్యాటర్ గా వచ్చిన అభిషేక్ శర్మ(Abhishek Sharma).. ఐదో వికెట్ కు వచ్చిన రింకు సింగ్ (Rinku Singh)తో కలిసి కొద్ది సేపు నిలకడగా రాణించారు. అనంతరం అభిషేక్ 29 పరుగుల వద్ద, రింకు సింగ్ 30 పరుగుల వద్ద అవుట్ కావడంతో 79 పరుగులకు భారత్ ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన శివమ్ దుబే ఇంగ్లాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు.
అలాగే హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన పవర్ ఫుల్ షాట్లతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. కష్టమైన బంతులను సింగిల్స్‌గా.. ఈజీ బాల్స్ ను బౌండరీలకు తరలించిన పాండ్యా 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో రెచ్చిపోయాడు అనంతరం 53 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అలాగే శివమ్ దుబే (Shivam Dubey) హర్దిక్ పాండ్యా (Hardik Pandya)కు తొడుగా నిలిచాడు. 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సక్సీర్లు బాదిన 53 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో భారత్ (India) 20 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఈ మ్యాచులో ఇంగ్లాండ్ బౌలర్లలో షకీబ్ మహమూద్ 3, బ్రైడన్ ఛార్జ్ 1, జామీ వర్టన్ 2, ఆదిల్ రషీద్ 1 వికెట్లు తీసుకున్నారు. కాగా ఈ మ్యాచులో ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే 120 బంతుల్లో 182 పరుగులు చేయాల్సి ఉంది.






