- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Asia Cup : ఆసియా కప్ ట్రోఫీని తిరస్కరించిన టీమిండియా
ఆసియా కప్ విజేతగా టీమిండియా నిలిచింది.

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్ విజేతగా టీమిండియా నిలిచింది. ఫైనల్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన టైటిల్ పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ చేజింగ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో టీమిండియా 9వ సారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం అవార్డు ప్రెజెంటేషన్ నాటకీయంగా సాగింది. ఆసియా కప్ ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత దాదాపు గంటకుపైగా తర్వాత ప్రెజెంటేషన్ సెర్మనీ ప్రారంభమైంది. భారత జట్టు ట్రోఫీ తీసుకోదని ముందు నుంచే వార్తలు వచ్చాయి. పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీనే ఆసియన్ క్రికెట్ కౌన్సిల్‌కు ప్రెసిడెంట్‌గా ఉండటమే అందుకు కారణం. ఆయన చేతుల మీద ట్రోఫీ అందుకోవడానికి భారత జట్టు ముందుకు రాలేదు. ‘ఈ రోజు రాత్రి టీమిండియా తమ అవార్డులను తీసుకోవడం లేదని ఏసీసీ నుంచి నాకు సమాచారం అందింది. కాబట్టి, అవార్డు ప్రెజెంటేషన్ ముగిసింది.’అని ప్రెజెంటర్ సిమోన్ డౌల్ తెలిపారు. ట్రోఫీ లేకుండానే భారత ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో ఆడొద్దని డిమాండ్ వ్యక్తమైన విషయం తెలిసిందే. అయితే, ఐసీసీ, ఏసీసీ నిబంధలను గౌరవించి భారత జట్టు టోర్నీలో పాల్గొంది. పాక్‌తో మ్యాచ్‌ల్లో ఆడమా?గెలిచామా? అన్నట్టే టీమిండియా ప్లేయర్లు వ్యవహరించారు. ఆ జట్టుతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పాక్ ప్లేయర్లకు భారత ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. టాస్ సమయంలో, మ్యాచ్ ముగిసిన తర్వాత కరచాలనం చేయలేదు. షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైందో తెలిసిందే. ఈ చర్యతో భారత జట్టు పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు మద్దతుగా ఉంటామనే సందేశాన్ని ఇచ్చింది. ఇప్పుడు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా భారత జట్టు ట్రోఫీని కూడా తీసుకోలేదు.






