ముదిరిన‌ షేక్ హ్యాండ్స్ వివాదం..టీమిండియాపై పాక్ కోచ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

by velandi.Saikiran |

పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు టీమిండియా ప్లేయర్లు. అయితే దీనిపై... పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ సంచలన

ముదిరిన‌ షేక్ హ్యాండ్స్ వివాదం..టీమిండియాపై పాక్ కోచ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

దిశ‌, వెబ్ డెస్క్ : టీమిండియా ( Team India) వర్సెస్ పాకిస్తాన్ ( Pakisthan) మధ్య దుబాయ్ ( Dubai) వేదికగా నిన్న జరిగిన మ్యాచ్ లో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈ మ్యాచ్ విజయం సాధించిన తర్వాత... పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్స్ ( No Hand Shake) ఇవ్వలేదు టీమిండియా ప్లేయర్లు. అయితే దీనిపై... పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ ( Mike Hesson) సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీమిండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడం చాలా బాధ కలిగించిందని స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత ఆటగాళ్ల తీరు చాలా దారుణంగా ఉందని... దానివల్ల తమ టీం నిరుత్సాహ పడిందన్నారు. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత... పాకిస్తాన్ ప్లేయర్ లందరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపారు. కానీ సూర్య కుమార్ యాదవ్, శివం దూబే ఇద్దరూ గ్రౌండ్ వదిలి వెళ్లిపోయినట్లు సీరియస్ అయ్యారు.

ఇది సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. ఆటను ఆటలాగే చూడాలని కోరారు పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ . అయితే అంతకుముందు టాస్ సమయంలో కూడా.... పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు. పహల్గాం సంఘటన నేపథ్యంలో... సూర్యకుమార్ యాదవ్ జట్టు ఇలా వ్యవహరించినట్లు చెబుతున్నారు. అయితే దీనిపై భారత అభిమానులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story