శ్రీలంకపై ఘన విజయం.. ఆసియా కప్ ఫైనల్‌కు భారత్

by Gantepaka Srikanth |

శ్రీలంకపై ఘన విజయం.. ఆసియా కప్ ఫైనల్‌కు భారత్

శ్రీలంకపై ఘన విజయం.. ఆసియా కప్ ఫైనల్‌కు భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: అండర్-19 ఆసియాకప్‌(ACC Mens U19 Asia Cup 2025)‌లో భారత్ ఫైనల్‌కు చేరింది. సెమీ ఫైనల్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది. దీంతో ఎల్లుండి ఆసియాకప్ ఫైనల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు భారత్ అర్హత సాధించింది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య దుబాయ్ వేదికగా ఈనెల 21న మ్యాచ్ జరుగనుంది. నేటి మ్యాచ్‌లో.. శ్రీలంక నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని ఇండియా 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విహాన్ (61*), ఆరోన్(54*) అర్ధశతకాలతో అదరగొట్టడంతోపాటు జట్టును గెలిపించారు. అంతకుముందు నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయిన శ్రీలంక 138 పరుగులు చేసింది. చమిక హీనతిగల (42), విమత్ దిన్సారా (32), సేథ్మికా సెనెవిరత్నే (30) టాప్ స్కోరర్ నిలిచారు.

Next Story