- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం జరిగే సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను టీమిండియా ఎదుర్కోనుంది. ఈ పోరు కోసం ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత జట్టు సన్నద్ధమవుతుంది. అయితే మంగళవారం ప్రాక్టీస్ సెషన్ ఆలస్యంగా ప్రారంభమైంది. చంద్ర గ్రహణం కారణంగా టీమ్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీస్‌ను గంటపాటు వాయిదా వేసింది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే, చంద్రగ్రహణం మధ్యాహ్నం 3 :20 గంటలకు మొదలై సాయంత్రం 6:40 గంటలకు వరకూ ఉంది. ఈ సమయంలో ప్రాక్టీస్ చేయడం మంచింది కాదని టీమ్ మేనేజ్‌మెంట్ భావించిందని సదరు వర్గాలు జాతీయ మీడియాతో తెలిపాయి. ‘చంద్ర గ్రహణం సమయంలో మంచి పని చేయకుండా ఉండాలని జట్టు అనుకుంది. అది కూడా సెమీస్ వంటి కీలక మ్యాచ్‌కు ముందు. సానుకూల దృక్పథంతో బరిలోకి దిగాలని జట్టు భావించింది. అందుకే ప్రాక్టీస్ సెషన్‌ను గంటపాటు వాయిదా వేయడానికి టీమ్ మేనేజ్‌మెంట్ అంగీకరించింది.’అని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో సాయంత్రం 6:40 గంటల తర్వాత భారత ఆటగాళ్లు మైదానంలో అడుగుపెట్టారు.






