- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్-పాక్ యుద్ధం.. ఫేక్ న్యూస్‌పై రోహిత్ శర్మ ట్వీట్
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం కోనసాగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: భారత్, పాకిస్థాన్ (India-Pakistan war) మధ్య యుద్ధం కోనసాగుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పలు నకిలీ వార్తులు, వీడియోలు వైరల్‌గా మారాయి. వీటిపై భారత్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit sharma) స్పందించారు. దేశ ప్రజల రక్షణకై భారత భద్రతా బలగాలు ఎల్లప్పుడూ ముందుంటారని, ఇలాంటి క్లిష్ట సమయాల్లో భారత సైన్యం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నట్లు చెప్పారు. అలాగే, ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ భారత సైన్యానికి తమ మద్ధతు తెలియజేయాలన్నారు. ఈ సమయంలో ప్రజలందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, ముఖ్యంగా ఫేక్ న్యూస్‌ను నమ్మకూడదనీ, దానిని షేర్ చేయకూడదని చెప్పారు. ఫేక్ న్యూస్ నమ్మటం వల్ల అనవసరమైన భయాలు, అపోహలు వ్యాపిస్తాయని తెలిపారు. అందరూ సురక్షితంగా ఉండాలంటూ రోహిత్ శర్మ ట్వీట్ చేశారు.
Next Story






