- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షేక్ హ్యాండ్స్ వివాదం...పాకిస్థాన్ సంచలన నిర్ణయం !
షేక్ హ్యాండ్స్ వివాదం...పాకిస్థాన్ సంచలన నిర్ణయం. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ కు టీమిండియా పై ఫిర్యాదు చేసేందుకు రంగం

దిశ, వెబ్ డెస్క్ : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం షేక్ హ్యాండ్స్ వివాదం కొనసాగుతోంది. కరచాలనం ఇవ్వకుండా టీమిండియా ప్లేయర్లు వెళ్లిపోయారని... పాకిస్తాన్ క్రికెటర్లతో పాటు, కోచ్, మాజీ ప్లేయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా పై ఫిర్యాదు చేసేందుకు... పాకిస్తాన్ నిర్ణయం తీసుకుందట.
షేక్ హ్యాండ్స్ ఇవ్వడం అనేది క్రీడా స్ఫూర్తి అని... కానీ టీమిండియా ప్లేయర్లు నిన్న అలా వ్యవహరించలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేస్తోంది. ఇందులో భాగంగానే ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ కు టీమిండియా పై ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ విషయంలో టీమిండియా పై చర్యలు తీసుకోవాలని.... ఓ నివేదికను కూడా అందించబోతుందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే ఈ వివాదం పై ఇప్పటివరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకవేళ పాకిస్తాన్ ఫిర్యాదు చేస్తే... బీసీసీఐ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.






