క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్

by Harish |

భారత ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్
X

దిశ, స్పోర్ట్స్ : భారత ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు మోహిత్ బుధవారం వెల్లడించాడు. ‘ఈ రోజు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా.హర్యాకు ఆడటం దగ్గరి నుంచి భారత జెర్సీ ధరించడం, ఐపీఎల్‌లో పాల్గొనడం వరకు నాకు దక్కిన ఆశీర్వాదం. నా కెరీర్‌కు వెన్నుముకగా ఉన్న హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. బీసీసీఐకి, కోచ్‌లకు, సహచరులకు, ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కృతజ్ఞతలు’అని మోహిత్ తెలిపాడు. కొత్త బాల్‌తో క్రమశిక్షణగా బౌలింగ్ చేయడంతోపాటు డెత్ ఓవర్లలో కట్టర్స్, స్లో బాల్స్, స్లో బౌన్స్‌లు సంధించడంలో మోహిత్ దిట్ట. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన భారత్ తరపున 26 వన్డేలు, 8 టీ20లు ఆడి 37 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో మొత్తం 120 మ్యాచ్‌ల్లో 134 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన మోహిత్ పెద్దగా ఆకట్టుకోలేదు. 8 మ్యాచ్‌ల్లో రెండే వికెట్లు తీశాడు.


Next Story