టోర్నీ వేదిక క్లీన్.. డెన్మార్క్ ప్లేయర్ విమర్శలను ఖండించిన బాయ్

by Phanindra |   (  Updated:2026-01-29 06:26:04  IST  )

ఇండియా ఓపెన్ టోర్నీ వేదిక క్లీన్‌గా ఉందని బాయ్ స్పష్టంచేసింది. డెన్మార్క్ ప్లేయర్ విమర్శలను ఖండించింది.

టోర్నీ వేదిక క్లీన్.. డెన్మార్క్ ప్లేయర్ విమర్శలను ఖండించిన బాయ్
X

దిశ, స్పోర్ట్స్: ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియన్ ఓపెన్ వేదికపై వచ్చిన విమర్శలను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) ఖండించింది. డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్ ఈ టోర్నీ జరుగుతున్న ఇందిరా గాంధీ స్టేడియం ఏమాత్రం శుభ్రంగా లేదని, చాలా డర్టీగా ఉందంటూ విమర్శలు చేసింది. ఈ విషయంలో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ఏడాది ఆగస్టులో జరిగే వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌ కూడా ఇక్కడే జరగనున్న నేపథ్యంలో ఈ విమర్శలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీనిపై స్పందించిన బాయ్ సెక్రెటరీ జనరల్ సంజయ్ మిశ్రా.. ఆమె చేసిన విమర్శలు టోర్నీ జరుగుతున్న వేదిక గురించి కాదన్నారు. ఆమె వ్యాఖ్యలు ఆడుతున్న పరిస్థితులు, వ్యక్తిగత ఆరోగ్యం గురించే. ఆడుతున్న యానెక్స్ సన్‌రైజ్ ఇండియా ఓపెన్ ఎరీనా గురించి కాదు. ఈ విషయాన్ని ఆమె కూడా స్పష్టంగా చెప్పారు అని మిశ్రా వివరించారు. ట్రైనింగ్ జరిగిన కేడీ జాదవ్ స్టేడియం గురించి ఆమె మాట్లాడిందని, ప్రధాన టోర్నీ జరుగుతున్న ప్రాంతం పూర్తిగా శుభ్రంగా ఉందని చెప్పారు.

ఆయుష్‌కు షాకిచ్చిన లక్ష్యసేన్

ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నీ ఆరంభంలోనే యంగ్ ప్లేయర్ ఆయుష్ శెట్టికి షాక్ తగిలింది. స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌తో జరిగిన ఆయుష్ ఓటమి చవిచూశాడు. బెంగళూరులో వీరిద్దరూ చాలాకాలం ప్రాక్టీస్ పార్టనర్‌లుగా ఆడారు. ఈ అనుభవాన్ని లక్ష్య వాడుకున్నంత బాగా ఆయుష్ ఉపయోగించుకోలేకపోయాడు. దీంతో చివరకు 21-12, 21-15 తేడాతో పైచేయి సాధించాడు. ఈ ఓటమితో టోర్నీ నుంచి ఆయుష్ తప్పుకున్నాడు.

Next Story