- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెమీస్‌లో సాత్విక్ జోడీ జోరుకు బ్రేక్.. ఇండియా ఓపెన్ నుంచి ఔట్
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ దూకుడుకు బ్రేక్ పడింది.

దిశ, స్పోర్ట్స్ : ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ దూకుడుకు బ్రేక్ పడింది. సెమీస్‌లో ఈ జంట పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మెన్స్ డబుల్స్ సెమీస్ మ్యాచ్‌లో సాత్విక్ జోడీ 18-21, 14-21 తేడాతో మలేసియాకు చెందిన స్జె ఫీ గో-నూర్ ఇజ్జుద్దీన్ జోడీ చేతిలో పరాజయం పాలైంది. 37 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో భారత జంట గట్టిగానే పోరాడింది. కానీ, మలేసియా ద్వయం దూకుడుగా ఆడుతూ పట్టు సాధించి చివరికి రెండు గేముల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది సెమీస్‌లోనే నిష్ర్కమించడం సాత్విక్ జోడీకి ఇది వరుసగా రెండోసారి. ఇటీవల మలేసియా ఓపెన్‌లోనూ సెమీస్‌లోనే ఓడిపోయిన విషయం తెలిసిందే. సాత్విక్-చిరాగ్ జంట 2022లో ఇండియా ఓపెన్‌లో మెన్స్ డబుల్స్ విజేతగా నిలిచింది. తాజాగా సాత్విక్ ద్వయం నిష్ర్కమణతో టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది.






