- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : సన్నద్ధత లేకపోతే మ్యాచ్‌లు ఆడేందుకు రావొద్దని భారత జట్టును భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ హెచ్చరించాడు. సౌతాఫ్రికా చేతిలో ఓటమిని అశ్విన్ తన యూట్యూబ్ చానెల్‌లో విశ్లేషించాడు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన అశ్విన్.. ఈ ఓటమి భారత జట్టుకు ఓ గుణపాఠమని వ్యాఖ్యానించాడు. టీమిండియా వ్యూహరచనలో విఫలమైందన్నాడు. అక్షర్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై అశ్విన్ స్పందిస్తూ. ‘ఐసీసీ ఈవెంట్లలో జట్లను మార్చకుండా స్థిరంగా ఉంచడం మంచిది. లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ల కోసం సుందర్‌ను తీసుకున్నారు. దానికి నేను అంగీకరిస్తా. కానీ, అక్షర్ పటేల్ టీ20ల్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. అతను ఏం చేశాడో మర్చిపోకూడదు.’అని తెలిపాడు. అలాగే, రింకు సింగ్ 8వ స్థానంలో బ్యాటింగ్ పంపడాన్ని కూడా తప్పుబట్టాడు. ‘భారత జట్టుకు 8 మంది బ్యాటర్లు ఉన్నారు. రింకు 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతన్ని ఆ పొజిషన్‌లో బ్యాటింగ్‌కు పంపొద్దు.’అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.






