- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసియా కప్ సెమీ ఫైనల్.. సూపర్ ఓవర్లో భారత్ ఓటమి
దోహాలో జరిగిన ఏసిసి మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 మొదటి సెమీఫైనల్‌లో ఇండియా ఏ ఓటమి పాలైంది.

దిశ, వెబ్ డెస్క్ : దోహాలో జరిగిన ఏసిసి మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 మొదటి సెమీఫైనల్‌లో ఇండియా ఏ ఓటమి పాలైంది. భారత్-ఏ, బంగ్లాదేశ్-ఏ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరు సూపర్ ఓవర్‌కు చేరింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్-ఏ బౌలర్లు మొదట్లో బంగ్లా బ్యాటర్స్ కు పరుగులు ఇవ్వకపోయినా.. చివరి 5 ఓవర్లలో 75 రన్స్ చేసి, స్కోర్‌ను 194/6 కు చేర్చారు. రహ్మాన్ (65), మెహరోబ్ 48* తో మెరిశారు. భారత్-ఏ చేజింగ్‌లో వైభవ్ సూర్యవంశి 15 బంతుల్లో 38 రన్స్‌తో బలమైన ప్రారంభం ఇచ్చాడు. నీహల్ వాధేరా(32)లు పోరాడారు.
చివరి ఓవర్‌లో అక్బర్ అలీ రన్-ఔట్ అవకాశాన్ని మిస్ చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. ఇక సూపర్ ఓవర్లో రిపాన్ మొండల్ మొదటి బంతికి యార్కర్‌తో జితేష్ శర్మ(కెప్టెన్)ను బౌల్డ్ చేసి, రెండో బంతికి అశుతోష్ శర్మను క్యాచ్ ఔట్ చేసి భారత్ కు పరుగులేమి ఇవ్వలేదు. బంగ్లా బ్యాటింగ్‌లో సుయాష్ శర్మ మొదటి బంతికి యాసిర్ అలీను క్యాచ్ ఔట్ చేసినప్పటికీ.. కానీ రెండో బంతి వైడ్‌గా వెళ్లడంతో – 1 రన్ స్కోర్‌తోనే బంగ్లాదేశ్-ఏ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఒక విధంగా, భారత్-ఏ కు ఇది షాకింగ్ ఓటమి అనే చెప్పవచ్చు.






