థాయిలాండ్‌ను చిత్తు చేసి.. మహిళల ఆసియా కప్‌లో భారత్‌ శుభారంభం

by Harish |

మహిళల హాకీ ఆసియా కప్‌లో భారత మహిళల హాకీ జట్టు శుభారంభం చేసింది.

థాయిలాండ్‌ను చిత్తు చేసి.. మహిళల ఆసియా కప్‌లో భారత్‌ శుభారంభం
X

దిశ, స్పోర్ట్స్ : చైనా వేదికగా మహిళల హాకీ ఆసియా కప్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ టోర్నీలో భారత మహిళల హాకీ జట్టుకు అదిరిపోయే ఆరంభం దక్కింది. మన అమ్మాయిలు తొలి మ్యాచ్‌లోనే తమ ప్రతాపం చూపించారు. థాయిలాండ్‌ను 0-11 తేడాతో చిత్తు చేశారు. భారత్ దూకుడుగా ఆడటంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. థాయిలాండ్ అసలు పోటీనే ఇవ్వలేదు. మొదటి నుంచి చివరి నిమిషం వరకూ మన జట్టుదే ఆధిపత్యం. 7వ నిమిషంలో ముంతాజ్ తొలి గోల్ చేసి జోరు మొదలుపెట్టగా ఏ దశలోనూ భారత్‌ను థాయిలాండ్ అడ్డుకోలేకపోయింది. ముంతాజ్, ఉదిత, బ్యూటీ రెండేసి గోల్స్‌తో సత్తాచాటారు. సంగీత, నవ్‌నీత్, లాల్రేమ్సియామి, షర్మిల, రుతుజలు కూడా చెరో గోల్ చేశారు. భారత్ శనివారం తమ తదుపరి మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే దాదాపుగా సూపర్ 4ఎస్ రౌండ్‌కు అర్హత సాధించినట్టే.


Next Story