టీమిండియాకు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ

by Harish |

వన్డే సిరీస్‌ గెలిచిన ఆనందంలో ఉన్న భారత జట్టుకు ఐసీసీ షాక్ ఇచ్చింది.

టీమిండియాకు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ
X

దిశ, స్పోర్ట్స్ : వన్డే సిరీస్‌ గెలిచిన ఆనందంలో ఉన్న భారత జట్టుకు ఐసీసీ షాక్ ఇచ్చింది. రెండో వన్డేలో స్లో ఓవర్ కారణంగా జరిమానా విధించింది. ఈ నెల 3న రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి ముందు 359 పరుగుల భారీ టార్గెట్ పెట్టినప్పటికీ కాపాడుకోలేకపోయింది. ఈ క్రమంలోనే భారత జట్టు నిర్ణీత సమయంలోగా తమ బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోయింది. రెండు ఓవర్లు వెనుకబడింది. ఐసీసీ ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలోగా తక్కువగా వేసిన ప్రతి ఓవర్‌కు మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధించొచ్చు. భారత జట్టు రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో మ్యాచ్ ఫీజులో 10 శాతం కోతపెట్టింది. టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ తప్పిదాన్ని అంగీకరించాడు. వైజాగ్‌లో జరిగిన మూడో వన్డేలో గెలిచిన టీమిండియా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.


Next Story