- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్ట్రాంగ్ టీమ్.. భారత టీ20 ప్రపంచకప్ జట్టుపై కుమార సంగక్కర కామెంట్
by Harish |
టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియానే ఫేవరెట్ టీమ్ అని శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర తెలిపాడు.

X
దిశ, స్పోర్ట్స్ : త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియానే ఫేవరెట్ టీమ్ అని శ్రీలంక క్రికెట్ దిగ్గజం, రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ కుమార సంగక్కర తెలిపాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు అతను మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన భారత జట్టు చాలా బలంగా ఉందన్నాడు. ‘జట్టు బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, నాణ్యమైన స్పిన్నర్లను కలిగి ఉంది. అలాగే, ఆడేందుకు మంచి కాంబినేషన్లను కలిగి ఉంది. ప్రపంచకప్‌లో ఎలా ఆడాలనే దానిపై రాహుల్ ద్రవిడ్, రోహిత్‌లకు మంచి ఆలోచన ఉంటుందని అనుకుంటున్నా. వారు రెండు లేదా మూడు కాంబినేషన్లను ప్రయత్నించవచ్చు. పరిస్థితులను బట్టి లోతైన బ్యాటింగ్ లేదా బలమైన బౌలింగ్ సామర్థ్యాన్ని కోరుకోవచ్చు. జట్టు సమతూకంగా,బలంగా ఉంది. అంతర్జాతీయ టోర్నీల్లో భారత్ ఎప్పుడూ గట్టి పోటీనే.’ అని చెప్పుకొచ్చాడు.
Next Story






