టీమిండియాకు షాక్... ఎడ్జ్‌బాస్టన్‌లో భారీ వర్షం..!

by velandi.Saikiran |   (  Updated:2025-07-06 15:02:51  IST  )

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడు విలన్ గా మారాడు. ఇవాళ ఐదో రోజు మ్యాచ్ ప్రారంభం

టీమిండియాకు షాక్... ఎడ్జ్‌బాస్టన్‌లో భారీ వర్షం..!
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడు విలన్ గా మారాడు. ఇవాళ ఐదో రోజు మ్యాచ్ ప్రారంభం కాకముందే.. వర్షం కూడా మొదలైంది. ఇంగ్లాండ్ లోని ఎడ్జ్ బస్టన్ లో ఇవాళ ఉదయం నుంచి వర్షం పడుతున్నట్లు చెబుతున్నారు. ఈ వర్షం నేపథ్యంలో టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే ఐదవ టెస్టు ప్రారంభం కాస్త ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఐదవ రోజున 7 వికెట్లు టీమిండియా తీస్తే... గ్రాండ్ విక్టరీ సాధించే ఛాన్స్ ఉంది. నిన్న సాయంత్రం మూడు కీలక వికెట్లను తీసిన టీమిండియా.. మంచి ఊపులో కనిపిస్తోంది. అయితే... ప్రస్తుతం స్టేడియం దగ్గర వర్షం భారీగా కొడుతున్న నేపథ్యంలో... టీమిండియా బౌలర్లు రిథమ్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకవేళ వర్షం ఇలాగే కొనసాగితే.. మ్యాచ్ డ్రా అయ్యే ప్రమాదం కూడా ఉంది.

దీంతో టీమిండియా అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు. వర్షం ఆగితే బాగుండని ప్రార్థనలు చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం లంచ్ బ్రేక్ తర్వాత నేరుగా మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ అలా జరిగిన.. 7 వికెట్లు తొందరగా తీస్తే కచ్చితంగా టీం ఇండియా గెలుస్తుంది. మరి ఈ రెండో టెస్టులో ఐదవ రోజు ఏం జరుగుతుందో చూడాలి.

ఒక్కరోజులో 536 పరుగులు కొట్టలేమని తేల్చేసిన ఇంగ్లాండ్ !

Next Story