- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లబ్యాండ్లు ధరించిన భారత్, ఇంగ్లాండ్ ప్లేయర్లు.. ఎందుకో తెలుసా?
తొలి టెస్టులో భారత్, ఇంగ్లాండ్ ప్లేయర్లు నల్లబ్యాండ్లు ధరించి కనిపించారు.

దిశ, స్పోర్ట్స్ : గతవారం అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 241 మంది ప్రయాణికులు మరణించారు. ఈ విషాద ఘటనలో మరణించిన వారికి భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు నివాళి అర్పించారు. శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఇరు జట్ల ప్లేయర్లు భుజానికి నల్ల బ్యాండ్లు కట్టుకున్నారు. అలాగే, టాస్‌కు ముందు ప్లేయర్లందరూ ఒక నిమిషంపాటు మౌనం పాటించారు.
ఇక, లీడ్స్‌లోని హెడింగ్లీలో శుక్రవారం తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ ఆచితూచి ఆడుతోంది. లంచ్ సమయానికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 92 రన్స్ చేసింది. యశస్వి జైశ్వాల్(42 నాటౌట్), కేఎల్ రాహుల్(42) జట్టుకు చక్కటి ఆరంభాన్ని అందించారు. అయితే, స్వల్ప వ్యవధిలోనే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. రాహుల్‌ను బ్రైడన్ కార్సే అవుట్ చేశాడు. ఇక, టెస్టుల్లో ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న అతను పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ పారేసుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో ఉన్న జైశ్వాల్ హాఫ్ సెంచరీ దిశగా వెళ్తున్నాడు.
- Tags
- India vs England






