- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడో స్థానంలో ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ముగించిన భారత్!
మూడో స్థానంలో ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌ను భారత్ ముగించింది. రెండు స్వర్ణాలు, రెండు కాంస్యాలతో నాలుగు మెడల్స్ సాధించింది.

దిశ, స్పోర్ట్స్: మ్యూనిచ్ వేదికగా జరిగిన మూడో ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో భారత బృందం మంచి ప్రదర్శన కనబర్చింది. 36 మందితో కూడిన ఈ బృందం మొత్తం నాలుగు మెడల్స్‌తో మూడో స్థానంతో టోర్నీని ముగించింది. వీటిలో రెండు స్వర్ణ పతకాలు, రెండు కాంస్య పతకాలున్నాయి. భారత్ కన్నా ముందు చైనా, నార్వే ఉండటం గమనార్హం. రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఎలవెనిల్ వలరివన్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో 231.2 పాయింట్లతో కాంస్యం సాధించి భారత పతకాల ట్యాలీని ప్రారంభించింది. అనంతరం రైఫిల్ షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో 453.1 పాయింట్లతో కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది.
గతంలో బ్యూనస్ ఎయిర్స్, లిమా లెగ్స్ టోర్నీల్లో స్వర్ణంతో మెరిసిన 19 ఏళ్ల సురుచి సింగ్.. ఈసారి కూడా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 241.9 పాయింట్లతో పసిడి పతకం సాధించింది. ఇక చివరగా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీం ఈవెంట్లో భారత జోడీ అర్జున్ బబుతా, ఆర్య బోర్సె అద్భుతమైన ప్రదర్శనతో స్వర్ణం సాధించింది. ఇక రైఫిల్, పిస్టల్ షూటర్ల మరుసటి ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2025 ఈవెంట్ ఈ ఏడాది సెప్టెంబరులో చైనాలోని నింగ్‌బో వేదికగా జరగనుంది.






