- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాస్కెట్‌బాల్ ఆసియా కప్ నుంచి భారత్ ఎలిమినేట్
ఎఫ్‌ఐబీఏ బాస్కెట్‌బాల్ ఆసియా కప్‌లో భారత్ పేలవ ప్రదర్శన చేసింది.

దిశ, స్పోర్ట్స్ : సౌదీ అరేబియాలో జరుగుతున్న ఎఫ్‌ఐబీఏ బాస్కెట్‌బాల్ ఆసియా కప్‌లో భారత్ పేలవ ప్రదర్శన చేసింది. భారత పురుషుల బాస్కెట్ బాల్ జట్టు ఒక్క విజయం కూడా సాధించకుండానే తన ప్రయాణాన్ని ముగించింది. వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. శనివారం జరిగిన చివరి గ్రూపు మ్యాచ్‌లో భారత్‌పై 59-84 తేడాతో సౌదీ అరేబియా విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ప్రత్యర్థిని నిలువరించలేకపోయింది. ముందుగా మ్యాచ్‌ను భారత్ బాగానే ప్రారంభించింది. తొలి క్వార్టర్‌లో 25-24తో పైచేయి సాధించింది. కానీ, ఆ తర్వాత జోరును కొనసాగించలేకపోయింది. వరుసగా 6-21, 18-21, 10-21తో మూడు క్వార్టర్స్‌లో వెనుకబడి మ్యాచ్‌ను కోల్పోయింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో జోర్డాన్, చైనా చేతుల్లో ఓడిపోయింది. గ్రూపు సిలో చైనా(6 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సౌదీ అరేబియా, జోర్డాన్ క్వార్టర్స్ బెర్త్ కోసం ప్లే ఆఫ్స్ ఆడనున్నాయి.






