స్కాట్లాండ్‌తో మ్యాచ్ డ్రా.. రాణించిన భారత అమ్మాయిల హాకీ టీం

by Phanindra |

ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ 2026 క్వాలిఫైయర్స్‌‌లో స్కాట్లాండ్‌తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత అమ్మాయిల హాకీ టీం రాణించింది.

స్కాట్లాండ్‌తో మ్యాచ్ డ్రా.. రాణించిన భారత అమ్మాయిల హాకీ టీం
X

దిశ, స్పోర్ట్స్: స్కాట్లాండ్‌తో జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ 2026 క్వాలిఫైయర్స్‌ గేమ్‌ను భారత మహిళలు డ్రాగా ముగించారు. పూల్-బీలో భాగంగా సోమవారం నాడు జరిగిన ఈ మ్యాచు 2-2 గోల్స్‌తో డ్రా అయింది. భారత జట్టులో నవనీత్ కౌర్ (18వ నిమిషంలో), సునీలిత టోపో (29వ నిమిషంలో) గోల్స్ చేశారు. స్కాట్లాండ్ తరఫున హెదర్ మెక్‌ఇవాన్ (6వ నిమిషం), ఫియోనా బర్నెట్ (33వ నిమిషం) గోల్స్‌తో మెరిశారు. ప్రస్తుతం ఈ రెండు జట్ల వద్ద 4 పాయింట్లు ఉండగా.. గోల్స్ ఎక్కువ చేసిన కారణంగా భారత అమ్మాయిలు గ్రూప్ టాపర్‌గా ఉన్నారు. అంతకుముందు ఉరుగ్వేను భారత్ 4-0తో ఓడించిన సంగతి తెలిసిందే. తమ తదుపరి మ్యాచులో బుధవారం నాడు వేల్స్ జట్టుతో భారత అమ్మాయిలు తలపడనున్నారు.

Next Story