- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : తెలంగాణ ఆర్చర్ తానిపర్తి చికిత అంతర్జాతీయ వేదికపై సత్తాచాటింది. థాయిలాండ్‌లో జరిగిన ఆసియా కప్ ఆర్చరీ స్టేజ్-1 టోర్నీలో రెండు పతకాలు గెలిచింది. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రజత్ చాహౌన్‌తో కలిసి గోల్డ్ మెడల్ సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్‌లో చికిత జోడీ 158-156 తేడాతో మలేసియా జంటను ఓడించింది. నాలుగు సెట్లలో జరిగిన గేములో చికిత జంట మూడు సెట్లు నెగ్గి ఆధిపత్యం ప్రదర్శించింది. అలాగే, మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో రాజ్ కౌర్, తేజాల్ సాల్వేలతో కలిసి చికిత రజతం కైవసం చేసుకుంది. ఫైనల్‌లో భారత జట్టు 227-229తో కజకస్థాన్ చేతిలో ఓడి తృటిలో బంగారు పతకం చేజార్చుకుంది. గతేడాది చికిత వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్‌లో అండర్-21 వ్యక్తిగత కాంపౌండ్ కేటగిరీలో గోల్డ్ మెడల్ దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆర్చరీగా నిలిచింది.
పురుషుల కాంపౌండ్ క్లీన్‌స్వీప్
పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ విభాగాన్ని భారత ఆర్చర్లు క్లీన్‌స్వీప్ చేశారు. ఉదయ్ కాంబోజ్ గోల్డ్ మెడల్ సాధించగా.. ప్రథమేశ్ సిల్వర్, రజత్ చాహౌన్ బ్రాంజ్ మెడల్స్ గెలిచారు. ఫైనల్‌లో ఉదయ్ 145-144తో ప్రథమేశ్‌పై నెగ్గాడు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో రజత్ 145-144తో థాయిలాండ్ ప్లేయర్‌పై విజయం సాధించాడు. మహిళల రికర్వ్ ఫైనల్‌లో రిధి ఓడిపోయి రజతంతో సరిపెట్టింది. మహిళల కాంపౌండ్ కేటగిరీలో తేజాల్ సాల్వే రజతం దక్కించుకుంది. పురుషుల రికర్వ్ జట్టు రజతం, పురుషుల కాంపౌండ్, మహిళల రికర్వ్ జట్లు కాంస్య పతకాలు సాధించాయి. దీంతో ఈ టోర్నీలో భారత్ మొత్తం 10 పతకాలను కైవసం చేసుకుంది. అందులో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, 5 కాంస్య పతకాలు ఉన్నాయి.






