- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం
ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం దక్కింది. 4x400 మీటర్ల రిలే బృందం పసిడి పతకంతో మెరిసింది.

దిశ, స్పోర్ట్స్: దక్షిణ కొరియాలోని గుమిలో జరుగుతున్న ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ రెండో రోజున భారత 4x400 మిక్స్‌డ్ రిలే బృందం పసిడి పతకంతో మెరిసింది. సంతోష్ కుమార్ తమిళిరసన్, రూపల్ చైదరీ, విశాల్ తెన్నరసు కాయల్విళి, శుభా వెంకటేశన్‌తో కూడిన బృందం 3.18.20 సెకండ్లలో రేస్ పూర్తిచేసింది. గత ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన భారత్.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగి మరోసారి పసిడి నెగ్గడం గమనార్హం. అలాగే డెకథ్లాన్‌లో తేజశ్విన్ శంకర్, ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రవేల్ రజత పతకాలు సాధించారు.ః
4x400 మిక్స్‌డ్ రిలే బృందంలోని సభ్యురాలు రూపల్ చౌదరి.. మహిళల 400 మీటర్ల రేసులో రజతంతో మెరిసింది. మహిళల 1500 మీటర్ల రేసులో భారత్‌కు చెందిన పూజ కూడా రజతం సాధించింది. చైనాకు చెందిన లి చుహూయ్ చేతిలో కేవలం 0.25 మిల్లీసెకన్ల తేడాతో స్వర్ణం కోల్పోయింది. అదే సమయంలో పురుషుల 1500 మీటర్ల రేసులో యూనస్ షా కాంస్య పతకం నెగ్గాడు. దీంతో టోర్నీలో భారత్ సాధించిన పతకాల సంఖ్య 8కి చేరింది. దీంట్లో2 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలున్నాయి. తొలిరోజు 10 వేల మీటర్ల రేసులో గుల్వీన్ సింగ్ స్వర్ణం నెగ్గగా, 20 కిలోమీటర్ల నడకలో సర్విన్ సెబాస్టియన్ కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే.






