మూడో రోజు బ్యాటింగ్ చేయకుండానే డిక్లేర్ చేసిన భారత్

by Malleboina Mahesh |

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ మొదటి రోజే వెస్టిండీస్ ఆలౌట్ అయింది.

మూడో రోజు బ్యాటింగ్ చేయకుండానే డిక్లేర్ చేసిన భారత్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, వెస్టిండీస్ (IND vs WIt) జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ (First Test match)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ మొదటి రోజే వెస్టిండీస్ (West Indies) ఆలౌట్ అయింది. అనంతరం భారత బ్యాటర్లు వెస్టిండీస్ బౌలర్లపై రెచ్చిపోయారు. ఓపెనర్ రాహుల్ 100, గిల్ 50, ద్రవ్ జురేల్ 125, జడేజా 104, జైస్వాల్ 36 పరుగులు చేశారు. అయితే రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 286 పరుగుల లీడులో ఉంది. అయితే మూడో రోజు ఈ లీడ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా.. మూడో రోజు ఆటను ప్రారంభించక ముందే భారత జట్టు డిక్లేర్ చేసింది. దీంతో 286 పరుగుల వెనుకంజలో వెస్టిండీస్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. మరీ ఈ ఇన్నింగ్స్ లో భారత బౌలర్లను వెస్టిండీస్ బ్యాటర్లు ఏ విధంగా ఎదుర్కొని నిలుస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Next Story