టీమిండియా రెండో ఇన్నింగ్స్ డిక్లేర్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే?

by velandi.Saikiran |

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో గిల్ సేన దూకుడుగా ముందుకు వెళ్తోంది. బ్యాటింగ్ అదే

టీమిండియా రెండో ఇన్నింగ్స్ డిక్లేర్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో గిల్ సేన దూకుడుగా ముందుకు వెళ్తోంది. బ్యాటింగ్ అదే సమయంలో బౌలింగ్ లో చాలా వరకు మెరుగుపడ్డ టీమిండియా... ఈ రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను బీట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రెండో టెస్ట్ లో .. టీమిండియా రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు నష్టపోయి 427 పరుగులు చేసిన తర్వాత గిల్ డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో టీమిండియా 607 పరుగుల ఆదిక్యంలో ఉంది. అంటే... మరో రోజులో... 608 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ విజయం సాధిస్తుంది. ఈ నేపథ్యంలోనే... రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండు తొందరగానే రెండు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ ఓపెన్ జాక్ డక్ అవుట్ కాగా.. డకెట్ 25 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఎప్పటిలాగే మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీయగా ఆకాష్ దీప్ మరో వికెట్ పడగొట్టాడు. ఇదే ఊపు రేపటి వరకు కొనసాగితే కచ్చితంగా రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా గెలుస్తుంది. ఎడ్జ్ బస్టన్ లో టీమిండియా గెలిస్తే అది చరిత్ర అవుతుంది. మరి టీమిండియా బౌలర్లు ఎలా రాణిస్తారో చూడాలి.

Next Story