టెస్ట్ క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డులు.. ఒకే టెస్టులో ఐదు సెంచరీలు

by Naga Rani Yarlagadda |

ఇండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ చూడని అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌తో లీడ్స్‌లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత జట్టు ఒకే టెస్ట్ మ్యాచులో నలుగురు ఆటగాళ్లు సెంచరీలు సాధించడం విశేషం.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డులు.. ఒకే టెస్టులో ఐదు సెంచరీలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ చూడని అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌తో లీడ్స్‌లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత జట్టు ఒకే టెస్ట్ మ్యాచులో నలుగురు ఆటగాళ్లు సెంచరీలు సాధించడం విశేషం. అంతేకాక.. వికెట్‌కీపర్ రిషభ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసి ప్రత్యేక రికార్డును నమోదు చేశాడు.

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైశ్వాల్ (101), శుభ్‌మన్ గిల్ (127 నాటౌట్), రిషభ్ పంత్ (134) సెంచరీలు సాధించారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (137)తో పాటు, రిషభ్ పంత్ మళ్లీ 118 పరుగులు చేయడం గమనార్హం. ఈ మ్యాచ్లో పంత్ ఒకే టెస్ట్‌లో రెండు సెంచరీలు చేసిన మొదటి భారత వికెట్‌కీపర్ గా నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఘనతను సాధించిన అరుదైన కీపర్లలో ఒకరిగా పంత్ నిలిచాడు.

మొత్తం 471 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ముగించిన భారత్, రెండో ఇన్నింగ్స్‌లో మరో 364 పరుగులు చేసి ఇంగ్లండ్‌కి 371 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగు రోజుల ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ 21 పరుగులు చేయగా.. వికెట్లు నష్టపోలేదు. దీంతో చివరి రోజు మ్యాచ్ ఎలా ముగుస్తుందోనన్న ఉత్కంఠ పెరిగింది.

ఈ టెస్ట్‌లో భారత్ బలమైన బ్యాటింగ్‌తో చరిత్రను రాసింది. ఒకే మ్యాచ్‌లో నాలుగు సెంచరీలు రావడం భారత టెస్ట్ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. రిషభ్ పంత్ తన అద్వితీయమైన ప్రదర్శనతో జట్టుకు అద్భుత విజయావకాశాన్ని అందించాడు.

Next Story