- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
180 రన్స్‌కే భారత్ ఆలౌట్.. అసంతృప్తి వ్యక్తం చేసిన పుజారా
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా ప్రదర్శనపై భారత సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్ మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ‘ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. ఆ పిచ్‌పై 250 నుంచి 275 పరుగులు చేయొచ్చు. కాబట్టి, మనం 70-80 రన్స్ తక్కువ చేశాం. ఆ క్రెడిట్ ఆసిస్ బౌలర్లకే దక్కుతుంది. ఆ విధంగా వారు బౌలింగ్ చేశారు. మన బౌలర్ల కంటే వారు మంచి లెంగ్త్‌తో బౌలింగ్ చేశారు. మన బౌలర్లు కూడా అదే తరహాలో బౌలింగ్ చేయడానికి ప్రయత్నించారని నాకు తెలుసు. కానీ, వారు అలా చేయలేకపోయారు.’ అని తెలిపాడు. అడిలైడ్ పిచ్‌పై భారత్ భాగస్వామ్యాలను నెలకొల్పడానికి ప్రయత్నించినా వరుసగా వికెట్లు కోల్పోయిందని చెప్పాడు. కాగా, ఫామి లేమితో పుజారా టెస్టు జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. చివరిసారి గతేడాది ఆసిస్‌తో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాడు.