ఆసియా చాంపియన్‌‌షిప్‌లో తెలుగమ్మాయి సురేఖ‌కు పతకం ఖాయం

by Harish |

ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ టీమ్ ఈవెంట్‌లో పతకం ఖాయం చేసుకుంది.

ఆసియా చాంపియన్‌‌షిప్‌లో తెలుగమ్మాయి సురేఖ‌కు పతకం ఖాయం
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరుగుతున్న ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ టీమ్ ఈవెంట్‌లో పతకం ఖాయం చేసుకుంది. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో ఆమె.. దీప్షిక, ప్రతీక‌లతో కలిసి ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో సురేఖ జట్టు 234-227 తేడాతో బంగ్లాదేశ్ టీమ్‌ను ఓడించింది. సురేఖ, దీప్షిక, ప్రతీక మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించారు. వరుసగా మూడు సెట్లలో 58-54, 58-56, 59-28తో పైచేయి సాధించారు. ఇక, చివరిదైన నాలుగో సెట్‌లో 59-59 సమంగా నిలువగా అప్పటికే భారత జట్టు విజయం ఖరారైపోయింది. గోల్డ్ మెడల్ కోసం ఫైనల్‌లో సౌత్ కొరియాతో తలపడనుంది. యశ్‌దీప్ సంజయ్, అథాన్ దాస్, రాహుల్‌లతో కూడిన రికర్వ్ పురుషుల జట్టు కూడా ఫైనల్‌కు చేరుకుని మెడల్‌ను ఖాయం చేసుకుంది. సెమీస్‌లో భారత జట్టు 5-3 తేడాతో కజకస్థాన్‌పై గెలుపొందింది. పురుషుల జట్టు కూడా ఫైనల్‌లో సౌత్ కొరియానే ఎదుర్కోనుంది.


Next Story