- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bad weather: భారత్, ఆస్ట్రేలియా ఆఖరి మ్యాచ్.. వర్షం కారణంగా రద్దు
భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లోని ఆఖరి, ఐదో మ్యాచ్ తాజాగా ఆగిపోయింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లోని ఆఖరి, ఐదో మ్యాచ్ రద్దు అయ్యింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో సిరీస్‌ను టీమ్ ఇండియా 2-1తో కైవసం చేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న గబ్బా స్టేడియం పరిసర ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో ఆటను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న టీ20 సిరీస్‌లోని ఐదో మ్యాచ్ ఇవాళ గబ్బా స్టేడియంలో జరుగుతోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో భారత్ బ్యాటింగ్ చేస్తోంది. వర్షం కారణంగా 4.5 ఓవర్ల తర్వాత ఆటను నిలిపివేశారు. ఆట నిలిపి వేసే సమయానికి జీరో వికెట్ల నష్టానికి భారత్ 52 రన్స్ చేసింది. అభిషేక్ (23), శుభ్‌మన్ (29) పరుగులతో క్రీజులో ఉన్నారు.
Next Story






