అంధుల క్రికెట్ కెప్టెన్ కన్నీళ్లు.. కుళ్లిన పండ్లు తిని మ‌రీ !

by velandi.Saikiran |

న్నీళ్లు పెట్టుకున్నారు టీమిండియా కెప్టెన్ దీపిక. దీంతో దీపిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

అంధుల క్రికెట్ కెప్టెన్ కన్నీళ్లు..  కుళ్లిన పండ్లు తిని మ‌రీ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: అంధుల భార‌త‌ మహిళల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచ కప్ 2025 టోర్నమెంట్ లో ( Blind T20 World Cup 2025) అంధుల భార‌త‌ జట్టు విశ్వ‌ విజేతగా నిలిచింది. ఈ ఫైనల్స్‌ మ్యాచ్ లో నేపాల్ జట్టు పైన ఏకంగా ఏడు వికెట్ల తేడాతో భారత జ‌ట్టు విజయం సాధించి, ఛాంపియన్ గా నిలిచింది. ఈ తరుణంలో టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ను తొలిసారిగా భారత్ గెలిచి చ‌రిత్ర సృష్టించింది. అయితే ఈ టోర్నమెంట్ లో భారత్ ను ఛాంపియ‌న్‌ గా నిలిపిన కెప్టెన్ దీపిక చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

భార‌త దేశానికి వచ్చిన భార‌త కెప్టెన్ దీపిక మీడియాతో మాట్లాడుతూ, టి20 ప్రపంచ కప్ లో భారత్ గెలవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. జనం విసిరే కుళ్ళిన పండ్లలో చెడు భాగాన్ని తీసేసి మిగతాది తానంటూ ఎమోషనల్ అయ్యారు. ఆ చెడు భాగాన్ని తనతో పాటు తన తోబుట్టువులు కూడా తిన్నామ‌ని ఈ సందర్భంగా వెల్ల‌డించారు. తమ ఇంట్లోనే కాదు ప్రతి భార‌త‌ ప్లేయర్ ఇంట్లో రోజుకు ఒక పూట భోజనం దొరకడం కూడా కష్టమే అంటూ ఎమోషనల్ అయ్యారు దీపిక.

ఇప్పటికీ తమ కుటుంబాల్లో పెద్దగా మార్పు లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు టీమిండియా కెప్టెన్ దీపిక. దీంతో దీపిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇవి చూసిన భార‌త జ‌ట్టు అభిమానులు, వెంటనే భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించాలని అంటున్నారు. వెంటనే అంధుల‌ క్రికెట్ జట్టుకు అండగా నిలవాలని కోరుతున్నారు. మొన్న 50 ఓవర్ల వరల్డ్ కప్ గెలిచిన మహిళల జట్టుకు భారీ నజరానా ప్రకటించినట్లుగానే, అంధుల క్రికెటర్లకు కూడా నజరానా ఇవ్వాలని డిమాండ్లు చేస్తున్నారు. మ‌రి ఈ విష‌యంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి, త్వ‌ర‌గా రియాక్ట్ అవుతుందా? లేదా ? అనేది చూడాలి.

Next Story