- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఆసియా కప్ టీమిండియాదే..!
ఆసియా కప్ ఫైనల్‌లో పాక్‌పై భారత జట్టు థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. దీంతో 9వ ఆసియా కప్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది.

దిశ, స్పోర్ట్స్: ఆసియా కప్పు మనదే. పాకిస్తాన్‌తో జరిగిన థ్రిల్లింగ్ ఫైనల్‌లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (69 నాటౌట్) అదరగొట్టే ప్రదర్శనతో జట్టుకు విజయాన్నందించాడు. 147 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన భారత్ కష్టా్ల్లో పడింది. కీలకమైన మ్యాచులో అభిషేక్ (5), గిల్ (12), సూర్య (1) దారుణంగా విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో తిలక్, సంజూ (24) జట్టును ఆదుకున్నారు.
అనంతరం శివమ్ దూబే (33) కూడా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో రింకూ సింగ్ (4 నాటౌట్) ఈ టోర్నీలో తను ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాది, టీమిండియాను విజేతగా నిలిపాడు. భారత జట్టు మరో రెండు బంతులు మిగిలుండగానే 150/5 స్కోరు చేసి, 9వ ఆసియా కప్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంలో టోర్నీలో పాక్‌పై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించినట్లయింది. ఈ టోర్నీలో లీగ్ దశలో, సూపర్-4లో పాక్‌పై విజయాలు నమోదు చేసిన భారత్.. ఇప్పుడు ఫైనల్‌లో కూడా దాయాదిపై పైచేయి సాధించడం గమనార్హం.






