రెండో టెస్టులో విజయం....టీమిండియా ఖాతాలో 4 రికార్డులు

by velandi.Saikiran |

రెండు టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ రెండో టెస్ట్ మ్యాచ్ లో ఏకంగా 336 పరుగుల తేడాతో... ఇంగ్లాం

రెండో టెస్టులో విజయం....టీమిండియా ఖాతాలో 4 రికార్డులు
X

దిశ, వెబ్ డెస్క్: రెండు టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ రెండో టెస్ట్ మ్యాచ్ లో ఏకంగా 336 పరుగుల తేడాతో... ఇంగ్లాండ్ టీం ను చిత్తు చేసింది టీమిండియా. మొదటి మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ... ఇప్పుడు ఇంగ్లాండ్ పై అధికారం తీర్చుకుంది. ఇవాళ ఉదయం వర్షం భారీగా కురిసినప్పటికీ... ఆ తర్వాత మ్యాచ్ కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మొత్తం ఇంగ్లాండ్ కు చెందిన ఏడు వికెట్లను కుప్పకూల్చారు భారత బౌలర్లు. దీంతో ఎడ్జ్ బస్టన్ వేదికగా తొలి విక్టరీ నమోదు చేసింది టీమిండియా.

అయితే ఈ విజయం నేపథ్యంలో... టీమిండియా నాలుగు అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. ఇవాల్టి మ్యాచ్ లో 336 పరుగుల తేడాతో... విదేశీ గడ్డపై టీమిండియా విజయం సాధించింది. విదేశీ గడ్డపై.. ఈ రేంజ్ లో టీమిండియా ఇప్పటివరకు గెలవలేదు. 2019లో వెస్టిండీస్ పై 318 పరుగులు, 2017లో శ్రీలంకపై 304, 2024లో పెర్త్ లో ఆస్ట్రేలియా పై 295 పరుగుల తేడాతో టీం ఇండియా విజయం సాధించింది. ఇక ఇప్పుడు 336 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

అలాగే ఎడ్జ్ బస్టన్ వేదికగా తొలి టెస్ట్ ను గెలిచింది టీమిండియా. అంతేకాదు సేన కంట్రీలలో... ఆసియా ఖండం తరఫున.. 30 టెస్ట్ మ్యాచ్ లు గెలిచిన జట్టుగా టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. అలాగే... ఒకే టెస్టులో 430 పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. ఇలా ఒక్క మ్యాచ్ లోనే నాలుగు రికార్డులు బ్రేక్ అయ్యాయి.

Next Story